పల్లవి
కానరు ప్రేమపామ దేవా అది
గానముసేయ నా తరమా ||కానరు||
జగముల పాలించు జగదీశ పరమాత్మ
పగబూనె నీమీద పటతర మూఢాత్మ
ఇదికూడ నీ లీలయే దేవా ||కానరు||
కలిగినది నములతలచరు నీ పేరు
కలిమినశించిన కలవరమొందేరు
పదవులు, లభియించ
మదమున చరియించి
పదపది నిన్నే ఎదిరించేరు
అధికులకిది సహజమాదేవా ||కానరు||