వేణుగాన లోలునిగన

పల్లవి

వేణుగాన లోలునిగన వేయికనులు చాలవులే
సరసరాగ మాధురిలో సకల జగము సోలునులే

చరణం 1

చిన్ననాడు గోపెమ్మల చిత్తములలరిరో
మన్నుతిన్న ఆ నోటినే మిన్నులన్ని చూపించి
కాళీయుని పడగల పై లీలగా నటియించి
సురలు నరులు మురిసిపోవ ధరణినేలు గోపాలుని ||వేణుగాన||

చరణం 2

అతని పెదవి సోకినంత అమృతము కురిసేను
అతని చేయితాకినంత బ్రతుకే విరిసేను
సుందరయమునా తటిలో బృందావన సీమలలో
కలసి మెలసి అలసి మెలసి వలపు తెలుపు వేళలలో ||వేణుగాన||