పల్లవి
[నారదుడు] జయహే కృష్ణావతారా
నందయశోద పుణ్యావతారా ||జయహే||
పాపులనణచీ - సాధుల బ్రోవగ
వ్రేపల్లె వెలసిన - గోపకిశోరా ||జయహే||
[యశోద] ఎన్నో జన్మల పున్నెము పండీ
నిన్ను కంటిరా చిన్నారి తండ్రీ
[పూతన] కన్నతల్లి నీ కడుపెరగదు నా
చన్నుగుడువ కనుమూసెదు రారా
[నారద] విష పూతన ప్రాణాపహారీ
శకటాసుర సంహారి - శౌరీ ||జయహే||
[గోపికలు] 1) కాపురమ్ము సేయలేమమ్మా - వ్రేపల్లెలోన
ఓ యశోదా : ఈ పాపమెందూ చూడాలేదమ్మా
2) పాలు వెన్న మనగ నీడు
3) పడుచు నొంటిగ చనగనీడు
4) కలిము ఉంటే కట్టి కుడుతురు
5) కన్న సుతునిటు విడుతురా
కాపురమ్ము సేయలేమమ్మా
[నారద] జయ హే కృష్ణావతారా
నందకుమారా! నవనీత చోరా ||జయ హే||
కాళింగమడుగున కాళీయు పడగల
కాలూని ధిమి ధిమి నాట్యము చేసి
సర్పాధీశుని దర్పము నణచిన
తాండవ నాట్య వినోదా ||జయ హే||
కాళీయ మణిగణ రంజిత చరణా
జయ హే కృష్ణావతారా
[చిన్నికృష్ణ] తనువుల పై అభిమానము వీడిన గాని
తరణులార ననుజేర తరముగాదులే
సిగ్గు వదిలి యిరుచేతులు జోడించండి
చెల్లింతును మనసుదీర మీ కోరికలా
[నారద] జయ హే కృష్ణావతార
గోపకుమారీ : వస్త్రాపహార ||జయ హే||
[చిన్నికృష్ణ] బాలుడితడనీ - శైలము
చాల బరువనీ
మీ భయము వదులుకొండీ
నా అండను చేరగరండీ
ఈ కేలల్లాడదు నమ్మండీ
[నారద] గోవర్ధన గిరిధారి
సురనాయక గర్వాపహారి ||జయ హే||
[రాధ] కృష్ణా!!!
రాధా మానసచోరా
నీ మధు మురళీ గానమునా
నా మనమూ బృందావనమూ
నిలుపున పూచీ - నీ పద పూజకు
పిలిచేనోయీ - రావోయీ
సేవలు చేకొన - రావోయీ ||రాధా మానస చోరా||