హే సంగీత లోలా

పల్లవి

[సాకి] హే సంగీత లోలా
కవిత లలిత వనమాలా . . . వేణుగోపాలా
యదు బాలా శ్రిత జినపాలా
దరిశిన మీవయ్యా గోపాలా ||యదు||
వేదన రూపై వేడినది
బాధిత హృదయం పాడినది
గాన విలోలా కరుగ విదేలా
దీనుల కానగ దయ గాదేలా ||యదు||
వెన్నెల దాచుట వీలగునా
మా కన్నుల మూయుట తిగవేనా
మన్నూ వెన్నా సమముగ తిన్నా
మాధవా నీకీ భేదము తగునా ||యదుబాల||
అందరి వాడవు అందని వాడవుకొందరికే వశమైనావా
[అందరూ] ఓ దేవా ఓ దేవా
పరవశమై ఈ మందిరమ్ములో బంధీవై పోయావా
ఓ దేవా ఓ దేవా
తల్లి యావతినే దాటిన వాడవు ద్వారము దాటి రాలేవా
ఓ దేవా ఓ దేవా
గోపాలా - వేణుగోపాలా