పల్లవి
ప్రభు నీదు మహిమ తెలియగవశమ
అభవా బహు నటనా విభవా ||ప్రభూ||
ప్రకృతి నీవే పురుషుడవీవే
ఏకో నారాయణుడవీవే
పరమాత్మనీవే జీవాత్మనీవే
అద్వైత బోధా అమృతాత్మనీవే ||ప్రభూ||
శ్రీ సతీ మోహనా పాహిమామ్
దేవా శ్రిత బాంధవా ||శ్రీ సతీ||
కార్య కారణకారణా - లీలాఖేలన లోలా ||శ్రీ సతీ||
ప్రణవ నాద భవ సంభవ
వేదాంత శ్రీవిభవాదేవా
విబుంధ వినుతసుచరితా
నామరూపరహితా ||శ్రీ సతీ||