పల్లవి
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
శశాంక మేని శోభితా - హర హర మహదేవ
ప్రశాంత యోగ దీపితా - హర హర మహదేవ
అపూర్వ బ్రహ్మచర్య నియమ భాజనా
హిమాచలాత్మ జాత హృదయ రంజనా
హర హర మహదేవ - హర హర మహదేవ
స్మశాన భూ నివాస సకల భువన పోషణ
విభూతి దేహ ధారణా విభూతి కారణా
ప్రళయాగ్ని నేత్ర తీక్షణా మోక్ష వీక్షణా
కరాళ గరళ భోజనాసుధా ప్రయోజనా
జైజైజై ప్రళయంకర అభయంకర
ఫణీశహార భూషణ హర హర హర మహదేవ
ప్రచండమృత్యుభీషణా - హర హర మహదేవ
అపార సంసార పాశ భంజనా
హిమాచలాత్మజాత హృదయరంజనా
శివోహం శివోహం శివోహం శివోహం