పల్లవి
వందేశంభు ముమాపతిం
సురగురం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం శశిధరం
వందే పశూనాం పతిం
హర హర శివ శంభో
భవహర శుభ గుణ గిరిజా బంధో ||హర||
అఘమేఘ హరణ ప్రభంజనా
నిరాకార నిర్వికల్ప గమనా
సత్య స్వరూపా నిర్వాణకారణ
[ప్రమధగణం] పాదానతహరి ముఖ సురబృందం
సంధ్యా సంధిత నటనానందం
సర్వాకాండకటాహిత తుందం
సర్వేశం జగదాది మకందం
హర హర శంభో - హర హర శివ శంభో
[జలంధరుడు] పురహర శంకర భూరిదయాకర
పరమేశ్వర క్షేమంకర శ్రీకరా
కరుణాకర గంభీరా గంగాధర శృంగా
స్థావర జంగమరూపా
శరణగతి ఆశాదీపా
[ప్రమధగణం] హర హర హర మహదేవా హర హర హర మహదేవా
[పార్వతి] స్వరనిత్యం శివనామాగణం
పఠిత చర్చితం దీనశరణ్యం
దహనిర్మూలం దోషారణ్యం
వహాతవ చరణం శివసాపుణం
[ప్రమధగణం] హర హర హర శంభో
హర హర హర శివ శంభో
[జలంధరుడు] అద్భుత విగ్రహ అమరాధీశ భవా
అగణిత గుణగణ ఆత్మానంద శివా
భవవిశ్వేశా హరత్రిపురారే
హర శంభో శశి చూడాపారే
జయ జయ జయ సాంబశివా
జయ జయ జయ సాంబశివా
దరిశనమిడుమో దేవా మహదేవా