పల్లవి
ప్రభు నీ పాదారాధనే తపోసాధనా
సందర్శాసానందమే సదానందము ||ప్రభు||
గిరులు తరులు విరిసిన పూలు
పావన గంగా జీవనదీశ్రీలు
ప్రభు దేవసాంశమె అవికావా కనరావా
రూపరమణా భూషణా
సదా నీదు దర్శనమే చిదానందము ||ప్రభు||
చెరకు తేనె మీగడపాలు
చక్కెర పండ్లు సార విహీనాలు
ప్రభు నీ నామమె మధురంబు రుచిరంబు
రాధరా సరసా ప్రేమమయా
యా సుమనో మోహనా
కానీదు దర్శనమే చిదానందము ||ప్రభు||