సాగరమీదుట భావం

పల్లవి

సాగరమీదుట భావం జేరుట శంభో నీ లీలా
భవసాగర మీదుట నీదరి జేరుట శంభో నీ లీలా
విధియే మారుట నీ లీలా దుర్విధియే మారుట నీ లీలా ||సాగర||
మారదు వక్తి మారదు భావము మారదు నీ భజన
విధియే మారుట నీ లీలా
దుర్విధియే మారుట నీ లీలా ||సాగర||
విధియానెదురై వినాశకరమై
నిరాశబలమై నిస్పృహ మయమై
ఆశాపూరిత జీవిత యాత్రా
అకాల మరణము ఆహుతిగొనుచో
మరణము గెల్చుట శరణము గాంచుట శంభో నీ లీలా
విధియే మారుట నీ లీలా
దుర్విధియే మారుట నీ లీలా ||సాగర||
అశేష జగతీ అనాదరముతో
నిందాలాపములాడగా
మమతామాయా మదిలో గానగ
అజ్ఞానములో అంధత్వములో
అల్లాడే తరి అండగనినావ
ప్రబోధ భాస్కరతేజమునించే
భక్తులనేలుట ముక్తినొసంగుట శంభో నీ లీలా
విధియే మారుట నీ లీలా
దుర్విధియే మారుట నీ లీలా ||సాగర||