బాల గోపాలా మాముద్ధరా

పల్లవి

బాల గోపాలా మాముద్ధరా కృష్ణా
పరమ కళ్యాణ గుణాకరా
బాల గోపాలా - చిన్ని బాల గోపాలా
ముద్దు బాలగోపాలా మా ముద్ధురా కృష్ణా
బాల గోపాలా
నంద బాల గోపాలా మా ముద్ధురా కృష్ణా
పరమ కళ్యాణ గుణకరా
మందస్మిత సుందరాననా,
కోటిమదన సుందర జగన్మోహన ||కోటి||
ఇందీరామందీరా భక్త
సుందరా హృదయారావిందా ||ఇంది||
ధికిత, ధికిత ధికితక తళాంగుతక ధిమి
ఇందిరా మందీరా భక్త
సుందరా హృదయారావిందా
భృంగ భక్త మకరందా
వందిత గోపికా బృంద ||బాల||