బృందావనమది అందరిదీ

పల్లవి

బృందావనమది అందరిదీ -
గోవిందుడు అందరి వాడేలే ||బృందా||

ఎందుకె రాధా ఈసు, నసూయలు
అందములందరి ఆనందములే ||బృందా||

పిల్లనగ్రోవిని పిలుపును వింటే
వుల్లము ఝల్లున పొంగదటే
రాగములో అనురాగము చిందిన
జగమే ఊయల నూగదటే
రాసక్రీడల రవణుని గాంచిన
ఆసలు మోసలు వేయవటే
ఎందుకె రాధా ఈసు, నసూయలు,
అందములందరి ఆనందములే ||బృందా||