పాహిమాం దేవా

పల్లవి

పాహిమాం దేవా, పాహి పాహిమాం ||పాహి||
పాహిమాం జగదేకరక్షా,
పాహిమాం కరుణాకటాక్షా ||పాహి||

చరణం

స్నేహభావముతోడనైనా
వైరిద్వేషముచేతనైనా
నిన్నుదలచెడి వారినందర మన్ననల దేవించు దక్షా ||పాహి||