నీ సరిదేవతలేరీ యేరీ

పల్లవి

నీ సరిదేవతలేరీ యేరీ నటనసూత్రధారీ . . . ||నీ||
దాసజనావళి, దయతో కాచెదు
దోషుల కాలనురాచెదవాహా ||నీ||

చరణం

వేదములకు నీ పాదము పట్టక రాదుగదా విలువా,
అయినను యేదియు నేరని వానిగ నాడుదు
వాదనకా యిది శౌరీ ||నీ||