కన్నయ్యా, నల్లని కన్నయ్యా

పల్లవి

కన్నయ్యా, నల్లని కన్నయ్యా
నిను కనలేని కనులుండునా
నిను ప్రేమింతురే నిను పూజింతురే
నన్ను గనినంత నిందింతురే ||కన్నయ్యా||
గుణమెంచ లేనింట పడవైతువా
నన్ను వెలివేయు వారికే బలిచేతునా ||గుణమెంచ||
సిరిజూచుకొని నన్ను మరిచేవయా
మంచి గుడి చూచుకొని నీవు మురుసేవయా ||కన్నయ్యా||
బంగారు మనసునే ఒసగినావు
అందు అందాల గుణమునే పొదగినావు ||బంగారు||
మోముపై నలుపునే పులిమినావు
ఇట్లు నన్నేల బ్రతికింప దలచినావు ||కన్నయ్యా||