పల్లవి
[ఆమె] గంధము పుయ్యరుగా పన్నీరు - గంధము పుయ్యరుగా
అందమైన యదునందనుపై
కుందరదన విరువొందన - పరిమళ గంధము పుయ్యరుగా
[అతడు] తిలకము దిద్దరుగా కస్తూరి
తిలకము దిద్దరుగా
కల కలమను ముఖ కళగని - సొక్కుచు
పలుకుల నమృతము - లొలికే స్వామికి
గంధము పుయ్యరుగా ||గంధము||
[ఆమె] చేలము కట్టరుగ బంగారు - చేలము కట్టరుగా
మాలిమితో గోపాల బాలురతో
ఆలమేపిన విశాల నయనునికి
[అతడు] గంధము పుయ్యరుగా
[ఆమె] పూజలు సేయరుగా మనసార
పూజలు సేయరుగా
జాజులు మరి విరజాజులు
దవనము రాజిత
త్యాగరాజవినుతునికి - గంధము పుయ్యరుగా
[అతడు] తిలకము దిద్దరుగా కస్తూరి - తిలకము దిద్దరుగా
[ఆమె] చేలము కట్టరుగా బంగారు - చేలము కట్టరుగా
[అతడు] పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా
[ఇద్దరూ] గంధము పుయ్యరుగా పన్నీరు
గంధము పుయ్యరుగా