పల్లవి
గోపాలనను పాలింప రావా
బృందావనిలో వేచితిరావా
చరణం 1
పొన్నల నీడ వెన్నెల వాడ
నిన్నే వెదికె నీ రాధనురా
మురళీలోలా మోహన బాలా
జాలము నీకేల కేళీ విలోలా ||గోపాల||
చరణం 2
పిల్లన గ్రోవి మెల్లగ వూది
అల్లరి చేసే నల్లని స్వామీ
వినేపడుటేనా ! కనపడరావా!
నీ రాగసుధలందు తేలించరారా ||గోపాల||
చరణం 3
గలగల లాడే యమునా నదిలో
ఊయల లూగే పూలనావలో
కాలము మరచీ లోకము విడిచీ
నీ దివ్య చరణాల నివశించ నీరా! . . . ||గోపాల||