పల్లవి
హృదయం ఓర్చుకోలేనిది గాయం,
ఇక పై తలచు కోరానిదీ ఈ నిజం,
పెదవులు విడిరాకా నిలువవే కడదాకా జీవంలో ఒదగవే ఒంటరిగా
లోలో ముగిసే మౌనంగా . . . హృదయం . . .
ఊహల లోకంలో ఎగరకు అన్నావే.
తేలని మైకంలో పడకని ఆపావే
ఇతరుల చిరునవ్వులో నన్ను వెలిగించావే ప్రేమ.
మరి నా కనుపాపలో నలుపై నిలిచావేమ్మా
తెలవారి తొలి కాంతి నీవో, బలికోరే పంతానివో,
అని ఎవరని అడగాలి
ఏమని చెప్పాలి . . .ఓ . . .ఓ . . . హృదయం . . .
వెచ్చని ఊపిరిగా వెలిగే సూరీడు
చల్లని చూపులతో దీవెనలు ఇస్తాడు
అంతటి దూరం ఉంటే బ్రతికించే వరమవుతాడు
చెంతకి చేరాడంటే చితిమంటే అవుతాడు
హాలా హలం నాకు సొంతం, నువ్వు తీసుకో అమృతం
అనుకుంటే ఆ ప్రేమే ప్రేమ కాగలదా . . .ఓ . . . హృదయం . . .