ఎలాగెలాగ . . .

పల్లవి

[ఆమె] ఎలాగెలాగ . . .
ఎల్లా మా ఇంటికొచ్చి మాయచేసావు. ఎల్లా నా లోపలే
ఈగోల పెంచావు. ఎల్లా నా దారిని ఇట్టా మార్చి వేసావు.
ఎల్లా నీ దారిలోకి తీసుకొచ్చావు. ఎలాగెలా . . .
[అతడు] పిల్లా నీలాంటి దాన్ని కోరుకున్నాను
పిల్లా ఆ మాట నాలో దాచుకున్నాను
పిల్లా నేనింతకాలం వేచి ఉన్నాను
పిల్లా ఆచోట నిన్నే చూచుకున్నాను
[ఆమె] ఎలాగెలాగ
[అతడు] కలలో ఓ రోజు బ్రహ్మదేవుడు వచ్చాడు
సరిగా నా గుండె పై నీ బొమ్మ గీసాడు
[ఆమె] ఎలాగెలాగ
[అతడు] ఇదిగో ఈ పిల్ల నీకీ జంటఅన్నాడు. పరుగునా వెళ్ళమంటూ నన్నుతన్నాడు.
[ఆమె] ఎలాగెలాగ
[అతడు] కొండలు దాటి, కోనలు దాటి, గుట్టలు దాటి,
గట్టులు దాటి దెబ్బకి అక్కడ ఎగిరి పడ్డాను, నీ దగ్గర పడ్డాను
[అతడు] అలాగెలాగా . . . అల్లా నీ ఇంటికొచ్చి మాయ చేసాను,
అల్లా నీ లోపలే ఈ గోల పెంచాను,
అల్లా నీ దారిని అట్టా మార్చివేసాన
అల్లా నా దారిలోకి తీసుకొచ్చాను
[ఆమె] అలాగెలాగా . . .
ఎప్పుడో మా బామ్మ నాకు మాట చెప్పింది
ఎవ్వడో వలవేసి నన్నే లాగుతాడంది
[అతడు] ఎలాగెలాగా . . .
[ఆమె] పోవే నే వెర్రిదాన్ని కాదు అన్నాను,
కానీ నువ్వు ముందుకు వస్తే ఆగుతున్నాను
[అతడు] ఎలాగెలాగా . . .
[ఆమె] ఎప్పటికప్పుడు ఏమవుతాడని చీ అని తప్పులు ఏం చేస్తానని
నిద్దర మాని ఆలోచిస్తున్నా, నిన్ను ఆరా తీస్తున్నా
[అతడు] ఎలాగెలాగా . . .
[ఆమె] అలాగెలాగా ఎలాగెలాగా . . .