మనసున మనసుగ

పల్లవి

[ఆమె] మనసున మనసుగ నిలిచే గలవా
పిలిచిన పలకవా ఎదగని కలవా
దొరికినదే నా స్వర్గం పరిచినదే విరి మార్గం
మిన్నుల్లోనీవే అన్నుల్లో నీవే కన్నుల్లో నీవే మావా ||మన||

చరణం 1

[ఆమె] మేఘం నేల ఒళ్ళుమీటే రాగమల్లే
ప్రేమా వరాల జల్లుకావా
[అతడు] పిలుపే అందుకొని బదులే తెలుపుకుని
కౌగిట ఒదిగి ఉండనీవా
[ఆమె] నా గుండె కోవేల విడిచి వెళ్ళదగునా తగునా
మల్లెపూల మాలై నిన్నే వరించి పోనిచ్చేవేళ
[అతడు] నిరీక్షించి స్నేహం కోరి జతనైరానా రాధా
ఉప్పోంగిపోయే కాయాన్ని నిన్నే విడువదులే ఏ వేళైనా
[ఆమె] నా శ్వాస ప్రతిపూట వినిపి మనిపో
[అతడు] ఏడేడే జన్మాలు నేనుంట నీ జంట

చరణం 2

[అతడు] పూవైనవ్వులని తేనై మాధురిని పంచవాట మన ప్రేమ
[ఆమె] విరిసే చంద్రకళ ఎగిసే కడలి అల
పలికే కవిత మకప్రేమ
[అతడు] కాలాన్ని పరిపాలిద్దాం కన్న కలలే నిజమయ్యి
వేటాడు ఏఎడబాటు ఏనాడు కలగదు ఇంక ఇటుపై
[ఆమె] నూరేళ్ళకాలంకాడా ఒక్కక్షణమై క్షణమై
నువ్వునేను చెరిసగమవుదాం వయస్సు పండేవరమై
[అతడు] ప్రియమైన అనురాగం పలికింది మధుగీతం
[ఆమె] తుదేలేని ఆనందం వీచేనే నీ కోసం ||మన||