ఛల్‌ ఛల్‌ ఛలో ఛల్‌రే చలో

పల్లవి

[అతడు] ఛల్‌ ఛల్‌ ఛలో ఛల్‌రే చలో సరదాగా సాగాలి ఛలో
ఛల్‌ ఛల్‌ ఛలో ఛల్‌రే చలో వరదల్లే పొంగాలి ఛలో
గిర గిర గిరా తిరిగే నైజం, నిలబడదిక ఏ నిమిషం జర జర జర
జాగే
వేగం, ఆగదు పయనం
ఛల్‌ . . .
6:20 మా చంటిగాడి ఇంటికి 6:30 కి మా బంటి రెస్టారెంట్‌కి
6:40 అటు నుంచి ఐ మాక్స్‌కి 7:00 కి ఏడుంటానో మరీ
కుదురుగా స్థిరముగా రాయల్లే ఉన్నావంటే లాభం లేనే లేదు
క్షణముకో స్థలములో బంతల్లే పరిగెడుతుంటే సంతోషాలే చూడు
ఛల్‌ . . .
సూరీడుకి శెలవుంటుందండీ రాత్రికి,
జాబిలికి కునుకుంటుందండీ పగటికి
నా ఒంటికి అలుపే రాదండీ జన్మకీ, నా దారిలో వెళ్తూంటా
పైపైకీ, గెలవడం, ఓడడం ఆ రెండు మాటలకి అర్థం చూద్దాం
లేవో రేపు, బ్రతుకులో ఆడటం
రేపంటే లాభం లేదోయ్‌ ప్రారంభించేయ్‌
నేడు . . .ఛల్‌ . . .