అసతోమా సద్గమయా

పల్లవి

అసతోమా సద్గమయా - తమసోమా జ్యోతిర్గమయా
ఆనందనిలయా - వేదాంత హృదయా
ఆనందనిలయా - వేదాంత హృదయా

చరణం 1

ఆత్మదీపమే వెలిగించుమయా
అంధకారమే తొలగించుమయా ||ఆనంద||
దీనజనావన దీక్షాకంకణ - ధారణమే నీ ధర్మమయా ||ఆనంద||

చరణం 2

సిరులకు లొంగిన నరుడెందుకయా . . .
పరులకు వొదవని బ్రతుకెందుకు కయా . . .
ఆనందనిలయా - వేదాంత హృదయా ||ఆనంద||

చరణం 3

కర్మయోగమే ఆదర్శమయా
జ్ఞానజ్యోతిని దర్శించుమయా ||ఆనంద||
మానవసేవమహాయజ్ఞమిది
సమిధవు నీవని తెలియుమయా

చరణం 4

కోవెల శిలకు కొలుపెందుకయా
నీ వెల తెలియని నీవెందుకయా ||ఆనంద||
[పల్లవి] అసతోమా సద్గమయా
తమసోమా జ్యోతిర్గమయా
ఆనంద నిలయా - వేదాంత హృదయా
మానవసేవమహాయజ్ఞ మిది
సమిధవు నీవని తెలియుమయా

చరణం 5

కోవెల శిలకు కొలుపెందుకయా
నీ వెల తెలియని నీవెందుకయా ||ఆనంద||
[పల్లవి] అసతోమాసద్గమయా
తమసోమా జ్యోతిర్గమయా
ఆనంద నిలయా - వేదాంత హృదయా