కలుష విభంగా

పల్లవి

కలుష విభంగా, కరుణామయాంతరంగా
గంగా కలిత శిరోరంగ శివలింగా
దీనుల రోదన వినగారాదో
నాపైన నీ దయ రాదో
వేదనతోనే వేగెనో
శోభన లెన్నడు తీరేనో
నాదస్వరూపా నాగాభరణా
నరజన శుభకరుణా, దేవా
కలుషవిభంగా, కరుణామయాంతరంగా
గంగా కలిత శిరోరంగ శివలింగా