పల్లవి
జై భజరంగ భళీ
రంగభళీ భజరంగభళీ - భజరంగభళీ - భజరంగభళీ
[సోలో] నమో నమో హనుమంత - మహిగుణవంత మహాబలవంత
స్వామీ నీ ముందు మేమెంత ||రంగభళీ||
నమో నమో హనుమంత - హిమవంత గుణవంత మహాబలవంత
స్వామి నీ ముందు మేమెంత
[సోలో] వరం నీ భక్తి భళీ భుజశక్తి భళీరఘురామ భక్తీ భజరంగబళీ
రంగభళీ భజరంగభళీ - భజరంగభళీ - భజరంగభళీ ||రంగ||
[సోలో] సూర్యుని మించును నీ తేజం - పవనుని మించిన నీ వేగం
అగ్నిని మించును నీ రౌద్రం - అమృతమయం నీ హృదయం
ఓ సుజన మందార - ఓదనుజ సంహార
నీ దివ్య చరణం - పాపహరణం
స్వామీ చరణం - మమ్ము కరుణించవయ్యా ||రంగ||
శ్రీ రామకార్యం చేపట్టినావూ - సీతమ్మజాడ కనిపెట్టినావు
లంకిణిని దెబ్బకు పడగొట్టినావు - అహ లంకాపురం తగలబెట్టినావు
లంకిణిని దెబ్బకు పడగొట్టినావు - అహ లంకాపురం తగలబెట్టినావు
ఆ ఒంటి తలల రావణులు - ఊరూరా ఉన్నారూ
కంటకనిపెట్టి - తోకచుట్టి
విసిరికొట్టిమమ్ము - కాపాడవయ్యా