శ్రీ రమణా హే

పల్లవి

శ్రీ రమణా హే శ్రిత కరుణా
జగతీ మోహన ఖగపతి వాహన
సురవందిత మృదు చరణాదేవా ||శ్రీ రమణా||
ఓంకారాత్మకదేవా లోకానుగ్రహభావా
కౌస్తుభమవేశోభితగ్రీహ కారుణ్యాదర మునిజనసేవా ||శ్రీరమణా||
సత్య కాంతయమూర్తి - దైత్య నాశకరాకీర్తి
చకిత చరాచర దశితార్తి - సకల విశ్వపరిపాలన స్ఫూర్తీ ||శ్రీరమణా||
కుక్షింభర నిర్మితభువనా అక్షయ సద్గుణ భువనా
సృష్టికారణా శిష్టపోషణా - పాలిత ఆశ్రిత భక్తగణా ||శ్రీరమణా||