కాళీ చిత్త సరోజ బంభర

పల్లవి

కాళీ చిత్త సరోజ బంభర హరా!
గంగా శశాంక ప్రియా!
క్ష్వీళా భీల వినీల మంగళగళా
క్షమంకరా! శంకరా!
కాలవ్యాళక పాల భూషరాధరా!
కారుణ్యరత్నాకరా!
ఫాలాక్షా! నటరాజ తాండవ శివా
భక్తావనా! పాహిమాం||