పల్లవి
పన్నగభూషణా సద్యోవర ప్రదాతా
అనంత తేజో మార్గ వినోదా
విశ్వేశ్వరా! గౌరీ హృదయేశ్వరా!
సాయంత్రాంబర నటరాజా!
క్షేమదాయకా! పరమేశా!
శరణంటిన్ కాంచవా దేవా!
శ్రమ తీర్చవా! ||సాయం||
జయమూ అభయమొసంగవే
ప్రభూ ఉమాపతీ!
సదమల శాంతిమయా! రావా
వరమొసగవా ||సాయం||
బహువిధ గీతులు కళలేడున్
పరమశివా నీ స్తుతి పాడున్
కళాలంకార భాగ్యదాయకా! ఈశా!
మదన దమనా!
దేవా! కరుణించవా! ||సాయం||