పల్లవి
బృందగానం - నృత్యం
నీదు దివ్య ప్రభల జగమోలలాడంగ
నిత్యం జీవులే నీ కీర్తి పాడంగ
యీ చరాచరములను కరుణించి పాలించుదేవా
పదునాల్గు భువనాల లాలించు దేవా
పరమాత్మా ఓ ప్రభో
జైజైజైజై జగదీశ్వరా
మాదు ప్రార్ధనలనాలకించు పరమేశ్వరా
దేవళమ్ములందు - కొలువుతీర్చియున్న దేవా
కోటి గొంతులెత్తి - నిన్ను పిలిచిన వినలేవా
ఓ దేవదేవా - దివ్య ప్రభావా
దిక్కునీవే మాకు జగదీశా
పాప పంకిలమందు పడివున్న భక్తులం
పరమపదమును జూపు పరమేశా
జైజైజైజై జగదీశ్వరా
మాదు ప్రార్థనల నాలకించు పరమేశ్వరా
ఓ కృపామయ
నిన్నె శరణమన్నామయా
దీనులను దీవించరావయా
నీ దివ్య పదములె స్వర్గసోపానములు
ధన్యులజేయుమో మమ్ము జగదీశా
మాకుతరియించు మార్గము జూపు పరమేశా ||జైజై||