క్రిష్ణా మా యింటికి రావో

పల్లవి

క్రిష్ణా మా యింటికి రావో ||కృష్ణా||
గజ్జెలందియులు ఘలు ఘల్లని మ్రోయంగ ||కృష్ణా||
శిరమున నెమలి పింఛము తూగి ఆడంగ
మురళి మ్రోగించుచు బిరబిరా రావోయి ||కృష్ణా||
మన్ను తింటి వటంచు తల్లీ నిన్నదిలింప
విశ్వరూపమునోట వెలయించిన వాడ ||కృష్ణా||