శ్రీ గోపాలమాంపాహి

పల్లవి

శ్రీ గోపాలమాంపాహి గోపీలోల
మాపై నీ కృపజూపి కాపాడవేల ||శ్రీగో||
కనబోవ వినలేవ ననుగావగ రావా
ఆపదల పోదోలి సుఖములొసగి ననుకాపాడుము ||శ్రీగో||
మనసార నినుగోరి చేరితి స్వామీ నా మనసార నినుగోరి చేరితి స్వామీ
నా కోర్కెలీడేర్చి దరిచేర్చుమా నా జన్మ తీరియించనన్నేలుమా ||శ్రీగో||
నీ రూపు చూడ - ఆడా - పాడా తమితో కూడా రా రావగ కాడా
మొలకనగవుల తళుకు కనులను చలువ పలుకులు కలికితనములు
కనిన వినిన నాతనివి తీరును మనసార నినుచేర చనవీర ||శ్రీగో||