జో అచ్యుతానంద జో జోముకుందా

పల్లవి

జో అచ్యుతానంద జో జోముకుందా
లాలి పరమానంద రామ గోవింద జోజో
తొలుత బ్రహ్మండంబు తొట్లు గావించి
నాలుగు వేదాల గొలుసుల మరించి జోజో
మృదువైన ఫణిరాజు పాన్పు సవరించి
హృదయ డోలిక లోన చేర్చి లాలించి
ఓం కార మనియేటి - వుయ్యాల లోన
తత్వమసియని ఏటి చలువల్లు పరిచి
వేడుకతో పావడి ఏర్పాటు చేసి
ఏడు భువనంబులూ ఏకమై వూచ
ఏడువకు ఏడువకు, ఏమి కావలెరా
మేలైన గురుబోధపాలు త్రాగుమురా జోజో