శ్లోకం
వందే శంభు ముమాపతిమ్ సురగురుమ్ వందే జగత్కారణం
వందే పన్నగభూషణమ్ మృగధరమ్ వందే పశునాంపతిం
వందే సూర్య శశాంక వహ్నినయనమ్ వందే ముకుందప్రియమ్
వందే భక్త జనాశ్రయించ వరదమ్ వందే శివం శంకరం
పల్లవి
శివ శివ శంభో భవభయ హరశంభో ||శివశివ||
శైలజా మనోహరా - కృపాకరా
ఫాలనేత్ర భీకరా - పాపహరా ||శివశివ||
జాహ్నవి జటాధరా - పరాత్పరా
నిర్వికార సుందరా - సౌఖ్యకరా ||శివశివ||