దేవ దేవ ప్రభోదయానిధే

పల్లవి

దేవ దేవ ప్రభోదయానిధే
పార్వతీవిభో దివిజ వినుత పద
పార్వతీవిభో దివిజ వినుత మహా ||దేవ||
పతిత పావనా, పాపవిమోచనా
శంకరభక్త వశంకర జయ జయ ||దేవ||
శంకరస్య చరిత కధామృతం
చంద్రశేఖర గుణానుకీర్తనం
నీలకంఠతవపాదసేవనం
సంభవంతు మమ జన్మ జన్మనీ
జయహే! జయహే! జయహే||