ఏమి ప్రభూ!

పల్లవి

ఏమి ప్రభూ! ఏమి పరిక్ష ప్రభూ
కాళీయ మద హరణా ||ఏమి||
దరిచేరిన వారలె మరుపా
వరిమీయని వేలుపువా వరదా
కరుణా వరుణాలయ నీకు
అరిపేదల బాధలు మురుపా ||ఏమి||
యెడబాయని తోడుగ కాపాడి
నీ దయ నించిన జీవితమూ
కధగా . . . వ్యధగా . . .
కడతేరగ కాపాడేవా ||ఏమి||