పల్లవి
దయచూడు ఏసుప్రభువా - నీవారి కావరావా
నిన్నే తలిచేమూ - నిన్నే కొలిచాము ||దయ||
చరణం 1
కనులైన లేని చీకటి బ్రతుకు - వెలిగించు జ్యోతి నీవే
దివిలోన - భువిలోనా నీ రూపే నిండెనయ్యా
మా తల్లి తండ్రి నీవే ||దయ||
చరణం 2
యే దారిలేని దీనులకోసం
లోకాన వెలసినావు - కరుణించీ - దీవించే
నీ నామం ముక్తి మార్గం - నీ ఉన్నచోటే స్వర్గం ||దయ||