పల్లవి
నాగుల చవితికి నాగేంద్రునీ
పొట్టనిండా పాలు పోసేము తండ్రీ ||
నీ పుట్టదరికి పాపలొచ్చేరు
మా పాపలొచ్చేరు
పాపపుణ్యముల వాసనేలేని
బ్రహ్మ స్వరూపులౌ పసి కూనలోయి
కోపించి బుస్సలు కొట్టబోకోయి ||నాగులచవితి||
అటుకొండ ఇటుకొండ
ఆ రెంటి నడుమ
నాగుల కొండలో నాట్యమాడేటి
దివ్య సుందరనాగ దెహీయన్నాము
కనిపెట్టి మమ్మెపుడు కాపాడావోయి ||నాగులచవితి||