ఓం నమో నమో నటరాజ

పల్లవి

ఓం నమో నమో నటరాజ
నమో హర జటాజూటధర శంభో
ఓం నమో నమో నటరాజ ||ఓం నమో||
గంగా గౌరి హృదయ విహారి - లీలా కల్పిత సంసారి
భళిరే భాసుర బ్రహ్మచారి - భానజ మదన సంహారి ||ఓం నమో||
ఫణిభూషా బిక్షుకవేషా - ఈశాత్రిభువన సంచారి
అఖిలచరాచర అమృతకారీ - హాలాహల గళధారి ||ఓం నమో||
మహాదేవ జయ జయ శివశంకర జయ త్రిశూలధర జయ డమకర ధర
హే దేవాది దేవ మహేశ జయజయ శ్రీ గౌరీశా ||ఓం నమో||