పల్లవి
శివోహం భవోహం
శివోహం భవోహం - హరోహం అనన్
చిదానందమే గదా చిత్తంబునన్ శివోహం ||
జటాజూట మాకాశ మింపారగా
లరాటంబునం దగ్ని సొంపారగా
తలన్‌పూవు జాబిల్లి అల్లారుగా సిరంబందునన్ గంగ పొంగారగా ||శివోహం||
కొండేగదావిల్లు నాగేంద్రుడేనారి
విష్ణుండే బాణంబుగా చందృండు, సూర్యుండు చక్రంబులై
భూమియ తేరురాగా - చండప్రచండాకృతిన్ బోయి
త్రిపురాసురున్ ద్రోహినిన్ దండించి ఖండించి యేడేడు
పదునాల్గులోకాలు పాలింపగా ||శివోహం||
లోకాల భక్తాళి చీకాకుపాల్‌గాక సౌఖ్యాల తేలించగా
శృంగార రూపంబు జంగమాకారంబు రంగారగా పూనగా - శివోహం||