పల్లవి
కస్తూరి రంగ రంగా మాయన్న - కావేటి రంగరంగా
శ్రీరంగ రంగ రంగా - నే నీకు భారమా రంగ రంగా
ఏడవకు ఏడవకురా - నాయనా ఎట్లు నిన్నోదార్తురా
నీ యేడ్పు నాయేడుపే - ఆలించు పాలించు వారు లేరే ||శ్రీరంగ||
నాగర్భవాసమందు, నా తండ్రి - ఏల జన్మించినావు
ఉగ్గు పాలిత్తమన్నా, గతిలేని నిర్భాగ్యురాలినైతీ ||శ్రీరంగ||