పల్లవి
ఓం నమ: శివాయ
జయ జయ మహాదేవ మృత్యుంజయా
జయ దివ్య ఫణి హార మృత్యుంజయా
ఓం నమ: శివాయ
కమనీయ శరదిందు కర్పూర గౌరాంగ
గంగా ఉమాసంగ రాగోదయా - మృత్యుంజయా
ఓం నమః శివాయ
పటహా కాహళ శఃఖ బణవ భేరి వాద్య
లయ యుక్త తాండవాడంబరా పురహరా! మృత్యుంజయా
ఓం నమః శివాయ
హాలాహల ఖీల కీలాపనయధుర్య
ఫాలాగ్ని హుతకామ ప్రమదాదిపా మృత్యుంజయా
ఓం నమః శివాయ
ఆది మార్కండేయ స్తవనీయ శరణీయ
పంచాక్షరీ మహా మంత్రాదిపా - మృత్యుంజయా
ఓం నమః శివాయ