చిలిపి కృష్ణునితో చేసావుపోటీ

పల్లవి

[అతడు] చిలిపి కృష్ణునితో చేసావుపోటీ
ఆ స్వామితో నీవు అందించసాటి ||చిలిపి||

చరణం 1

చెఱసాలలోపుట్టి వ్రేపల్లెలో వెలసి
గొల్లతల్లుల మనసు గొల్లగొనినాడు
ఏ తల్లి ఒడిజారి ఏలాగుచేరెవో
ఆ పొదలు కాపుదల ఆయెను నీకు
[ఆమె] జో అచ్చుతానంద జోజో ముకుందా
లాలిపరమానంద రామగోవిందా
పలువేషములు పూని పగవారి హింసింప
పలుపోకడలుచూసె బాలగోపాలుడు
[అతడు] ఈ ఈడుకే ఎన్ని గండాలు గడిచాయో
ఎంత జాతకుడమ్మా అనిపించినావు ||జో అచ్యు||
[ఆమె] కావించు పొగరనిచి కంసున్ని పరిమార్చి
కన్నవారికి చెఱలు తొలిగించినాడు
[అతడు] వసుదేవ తనయుని వారసత్వము నిలిపి
నీవారి వెతలెల్ల నీవె తీర్చెవు ||చిలిపి||