ప్రేయసి మనోహరి వరించి చేరవే

పల్లవి

[అతడు] ప్రేయసి మనోహరి వరించి చేరవే
తియ్యని మనోరధము నా తియ్యని మనోరధం
ఫలింప చేయవే ||ప్రేయసి||
[ఆమె] దరిజేరిపోవనేల హృదయవాంచ తీరువేళ ||2||
తారక సుధాకరా! తపించసాగినే
హాయిగా మనోహర వరించి చేరుమా ||2||
[ఆమె] మురిసింది కలువకాంత చెలునిచేయి పోలినంత ||2||
త్యాగమే సరాగమై ప్రబోధమాయెనె
పెనవేసె మల్లెతీగ మనసులోన మమతరేగే ||2||
ఊహలో ఒయ్యారమో ||2|| ఉయ్యాలలూగెనే ||ప్రేమసి||