పల్లవి
[అతడు] చెకచెకలాడే నడుము చూడు
నడుమును ఊపే నడక చూడు
[ఆమె] నడకను చూస్తు వెనకపడే ఈ పడుచువానిలో పొగరు చూడు
చరణం 1
[అతడు] కోలకన్నుల కుర్రదాన నీ కోపములోనె కోరికవుంది
[ఆమె] కోరిక దాచిన కుర్రవాడా నీ కొంటెతనంలోనే గమ్మత్తుంది
||కోల||
[అతడు] కరినగంటి జడ చూడు అది కాటేసేనే మగవాడు
[ఆమె] సుడిగాలంటే మగవాడు నను చుట్టెయ్యాలి ఒకనాడు ||కరి||
[అతడు] అది నిజమౌతుందని అన్నాను
[ఆమె] నీ గడుసుతనాన్ని మెచ్చాను || కోరు ||
చరణం 2
[ఆమె] చెప్పలేక ఎన్నాళ్ళో దాచుకున్నాను
నువ్వు ఒప్పుకోవని కొన్నాళ్ళు ఊరుకున్నాను
[అతడు] చెప్పలేనివి చెప్పేటందుకే కన్నులు వున్నవి ||2||
[ఆమె] అవి ఒప్పుకుంటే మనసులు రెండూ ఒక్కటవుతాయి || కోల ||
[ఆమె] పిల్లను చూసిన అబ్బాయి నీ పెళ్ళికి నేను వస్తాను
[అతడు] పెళ్ళికి వచ్చి అమ్మాయీ నా ప్రక్కన పీటేఇస్తాను
[ఆమె] నా మనసున ఫీటను వేసాను
[అతడు] నీ మమతకు తాళికట్టాను
||కోల||