గణ గణ గణ గణ గణ

పల్లవి

[అతడు] గణ గణ గణ గణ గణ గణ గణ గణ గణ మంటూ గంటే నీతో కట్టేస్తారు
[ఆమె] ధన ధన ధన ధన ధన మంటూ నీలో పుట్టిస్తారా
[అతడు] గణ గణ గణ గణ గణ గణమంటూ ముద్దులతో మర్దన చేస్తా
[ఆమె] ధన ధన ధన ధన ధన మంటూ పెదవులతో మద్దతు ఇస్తా
[అతడు] శృంగార యుద్దం జరిపిస్తా శంకాలు నేడే పూరిస్తా
[ఆమె] సరసాల క్షేత్రం చూపిస్తా ఈనాడే విజృంబించేస్తా ||గణ||


చరణం 1


[ఆమె] విన్యాసం చూపించేస్తా వికారాలు పోగొడతా సన్యాసం మాన్పించేస్తా సుఖం
పెంచుతా
[అతడు] కాషాయం వదిలేసేస్తా కమండలం విసిరేస్తా కామేశ్వరి యజ్ఞం చేస్తా కధం
తొక్కుతా
[ఆమె] మగాడికి నిబ్బందిస్తా మహొత్సవం జరిపిస్తా
[అతడు] చెలి చీరకి విస్సందిస్తా క్షణానికో కాటేస్తా
[ఆమె] చిందర వందర తొందర తొందర త్వరపడదాం త్వరపడదాం
ముందర ముందర సుందర సుందరి ఉందిరా ముడిపెడదాం రా ||గణ||


చరణం 2


[ఆమె] అరికాలిని తాకాలంటా అలాపైకి రమ్మంటా మోకాలికి మొక్కాలంటా అదో
ముచ్చటా
[అతడు] నీ నడుమును నవ్విస్తుంటా నిదానంగా వస్తుంటా నీ నాభిని దువ్వేస్తుంటా
అదో అచ్చటా
[ఆమె] అందాలు నావేనంటా అనుభవలు మనవేనంటా
[అతడు] అన్వేషణ నాదేనంటా అమృతాలు మనవంటా
హరే రామ హరి కృష్ణా హరే రామ ||2||