నీ ఇల్లు బంగారం కాను నారవ్వల

పల్లవి

[ఆమె] నీ ఇల్లు బంగారం కాను నారవ్వల కొండ నీ ఒళ్ళో బందీనవుతాను
నీ ఒళ్ళో ఉల్లాసంగాను నా గవ్వల దండ కౌగిట్లో వందేళ్ళుంటాను
[అతడు] చిలకను నేను చెరుకువు నువ్వు కొరికిన వేళ కాదనకు
[ఆమె] పలకను నేను బలపం నువ్వు కలిసిన వేళ వలపులు రాయకుండా
వెళ్ళకు ||నీ ఇల్లు||


చరణం 1


[ఆమె] నీకే అందకపోతే అందం బంధం కానే కాదు నీతో ఆడకపోతే ఆటేకాదంటా
[అతడు] నువ్వే ఉండక పోతే లోకం లోకం కానే కాదు నీలో ఉండకపోతే నేనే కాదంటా
[ఆమె] దోరలాగా దొరికావు నిను దోచుకోకపోను
[అతడు] కధలాగా కదిలావు నిను చదవకుండా వెళ్ళను ||నీ ఇల్లు||


చరణం 2


[ఆమె] ముక్కుపోగు చుట్టేసింది ముద్దుకు అంటూ రానని మువ్వకుండా చుట్టేసింది
సవ్వడి చెయ్యనని
[అతడు] సిగ్గు సిగ్గు చెప్పేసింది గుట్టుగా దాచేస్తానని జారు బయట చెప్పేసింది మాటే
జారనని
[ఆమె] మగవాడై కదిలావు ముడివేసుకోకపోను
[అతడు] వగలాడై రగిలావు సెగలనచకుండా ఉండను ||నీ ఇల్లు||