పల్లవి
[అతడు] కదులు కదులు పదా చక చక కనపడుపదా
ఎవడు ఎవడు మనకెదురుగా నిలవదు కదా
కదులు కదులు పదా చక చక కనపడు పదా
అదిరి పడకు ఇది రగిలిన యువకుల రొధ ఉవ్వెత్తైనా ఉత్సాహాలు హొరెత్తాయు నేడు
ఉత్తెజాలు వెర్రెత్తాకా చూపెయ్ జోరు
ముల్లోకాలు కమ్మేదాకా చల్లారేది లేదు
దక్కేదేదో చిక్కేదాకా తాడోపేడో తేల్చెయ్యాలా
అందనిదేది ఇలలోనా మనసే పెడితే జానోనా
అంచులుతాకే కసి ఉంటే గెలుపే మనది దేఖోనా
చరణం 1
[అతడు] సిరులకు దొరకని మణి లేరా మసాక వరమేరా
తెలివిగా మనస్సుని మదియిస్తే విజయం మనదేరా
తిలకడరో నేస్తం కలివెడరో వస్త్రం కృషితోడై ఉంటే దిగిరాదా స్వర్గం
పంచెయ్ ఉల్లాసం దింపెయ్ చైతన్యం
కూల్చే కల్లోలం సాగే ప్రస్థానం ||కదులు||
చరణం 2
[అతడు] పదుగురు నడిచిన బాటలలొ మసిలితే పసలేదో
విధిగతి సైతం ఎదురిస్తూ చరితను మార్చాలోయ్
సమరానికి సై సై పద పదరో రైరై
విలయాలను వంచెయ్ వలయాలను తుంచెయ్
రారో రా నేస్తం నీదే ఆలస్యం
చేసెయ్ పోరాటం అది నీ కర్తవ్యం ||కదులు||