అందగాడా అందగాడా అందాలన్నీ

పల్లవి

[ఆమె] అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా...!
అల్లుకోరా గిల్లుకోరా అందమతా నీదిరా
మల్లెమొగ్గా మల్లెమొగ్గా రమ్మంటోందోయ్ అందగాడా
పూలపక్కా ఆకువక్కా అందుకోరా సుందరా
గోదారల్లే నాలో పొంగే కోరికమ్మా
నీదేలేరా నోరూరుంచే ఆడబొమ్మా
ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా

చరణం 1

[ఆమె] గాలే తాకనీ నాలో సోకునీ ఇన్నాళ్ళూంచానయ్యో నీకోసం
నా అందంచందం అంతా నీకోసం తోడే లేదనీ కాలే కౌగిలీ
ఎప్పటి నుంచీ ఉందో నీకోసం నా ప్రాయం ప్రాణం అంతా నీకోసం
ఎందుకో ఏమిటో ఇంతకాలం ఎంతో దూరం
ముందరే ఉందిగా సొంతమయ్యే సంతోషం

చరణం 2

[ఆమె] జారేపైటకీ తూలే మాటకీ తాపం పెంచిందయ్యో నీ రూపం
ఏనాడు లేనేలేదు ఈమైకం నాలో శ్వాసకీ రేగే ఆశకీ
దహం పెంచిందయ్యో నీ స్నేహం గుర్తంటూ రానేరాదు ఈలోకం
నీజతే చేరితే మామమయ్యే నాలో మౌనం
రాగమై సాగెనే అంతులేని ఆనందం