పల్లవి
[అతడు] ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో
నువ్అచ్చుల్లోన హల్లువో జడకుచ్చుల్లోన మల్లెవో
కరిమబ్బుల్లోన విల్లువో మధుమాసంలోన మంచు పూల జల్లువో
చరణం 1
[అతడు] ఈ పరిమళమూ...నీదేనా నాలో పరవశమూ....నిజమేనా
బొండుమల్లి పువ్వు కన్న తేలికగు నీ సోకూ
రెండు కళ్ళు మూసుకున్న లాగు మరి నీవైపూ
సొగసుల చూసి పాడగా ఎలా కనులకు మాట రదుగా హలా
వింతల్లోనూ కొత్తవింత నువ్వేనా అందం అంటే అచ్చంగానూ నువ్వే
చరణం 2
[అతడు] ఆ పలుకులలో...పరవళ్ళూ తూలే కులుకులలో...కొడవళ్ళూ
నిన్ను చూసి ఒంగుతుంది ఆశపడి ఆకాశం
ఆ మబ్బు చీర పంపుతుంది మోజుపడి నీ కోసం
స్వరముల తీపి కోయిలా...ఇలా
పరుగులు తీయకే అలా...అలా
నవ్వుతున్న నున్ను చూసి సంతోషం
నీ బుగ్గ సొట్టలోనే పాడే సంగీతం