పల్లవి
[అతడు] కొట్టు కొట్టు కొట్టు రంగుతీసి కొట్టు రంగులోన లైపు ఉందిరా
కొట్టు కొట్టు కొట్టు డోలు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు వుందిరా ఎర్ర రంగులోన
చూడు రబ్బా రబ్బా
కుర్రగుండెలోన జోరు ఉంది
[కోరస్] రబ్బారే
పచ్చరంగులోన చూడు
[కోరస్] రబ్బా రబ్బా
పడుచు కళ్ళగీర ఉంది
[కోరస్] రబ్బారే
రంగు ఏదైనా గాని ఊరు ఏదైనా గాని రారా మనమంతా ఒక్కటే హొలి హొలి
హొలి రంగుల రంగోలి నింగి నేల రంగే మారాలి
[కోరస్] హొలి హొలి హొలి రంగుల రంగోలి
చెమ్మకేలి జలకాలాడాలి ||కొట్టు కొట్టు||
చరణం 1
[ఆమె] కోరమీసము రోషగాడివే ఓరకంట నన్ను చూడవెందుకు
[అతడు] కొంటెకోనంగి పిలవే కాస్తూరుకుంటే కొంపె కొల్లేరు చేతవే
[ఆమె] అన్ని ఊళ్ళకి అందగత్తినే చెంతకొచ్చి పలకరించవెందుకు
[అతడు] అమ్మో సంధిస్తే చాలులే అరగంటలోనె మెళ్ళో జడగంటలేస్తవే
[ఆమె] నవ్వే ఓరందగాడా నువ్వే ఆసందలౌడ నతో సరసాలు ఆడరా దావే దావే
[అతడు] అట్టా కయ్యాలభామ నీతో సయ్యాటలాడ నీపై ఆశంటు ఒకటి ఉండాలే
[ఆమె] ఇంద్ర మనస్సులోని ఉండే ఆరంగులన్ని నాలో ఉన్నాయి చూడరో
[కోరస్] హొలి హొలి హొలి రంగుల రంగోలి చిందుమీద చిందే వెయ్యాలి
హొలి హొలి హొలి రంగుల రంగోలి చీకు చింతలన్నీ మరవాలి ||కొట్టు కొట్టు||
చరణం 2
[ఆమె] కాటుకెట్టి కళ్ళమాటునా దాచుకున్నా కన్నె ఊసులెందుకు
[అతడు] నీల నీలాల నింగిలో ఆగాలి మేడలెన్నో కట్టెయ్యడానికే
[ఆమె] పాలబుగ్గల చిన్నదానికి పైట చెంగు ఎగిసి పడేదెందుకు
[అతడు] బంతి పువ్వంటి భామని కొంగున కట్టి బంతులందించడానికే
[ఆమె] నన్నే పెళ్ళడువాడు తాడే కట్టేటి జోడు ఎట్టా ఉంటాడు ఏమో నా జతగాడు
[అతడు] నిన్నే మిచ్చేటి వాడు బుగ్గే గిచ్చేటితోడు రానేవస్తాను చూడు ఓనాలో
[ఆమె] పొంగే నా వెన్నెలన్ని పండే నవరంగులకి చిందే బంగారు కాంతులే
[కోరస్] హొలి హొలి హొలి రంగుల రంగేలి సంబరాల సరద చెయ్యాలి
హొలి హొలి హొలి రంగుల రంగేలి సందడంతా మనదే కావాలి ||కొట్టు కొట్టు||