ఇందురూడు చందురూడు సూపుతోనే

పల్లవి

[ఆమె] ఇందురూడు చందురూడు సూపుతోనే సూది గుచ్చి చంపుతాడు
అందగాడు అందగాడు మాటతోనే మత్తుమందు చల్లుతాడు ||2||కారంగా
నువ్వే నవ్వి చురకేసే పిల్లగాడు కమ్మగా చిటకా చేసి చుట్టూ తిప్పుకున్నాడు
మెల్లంగా మీసం దువ్వి మెలికేసే తుంటరోడు చల్లంగా మస్కా కొట్టి మనస్సే
గుంజుతున్నాడు వాలు చూసి వీలుచూసి ముగ్గులోకి దించినాడు కొలికేస్తే
వేలికేసె మాయదారి సచ్చినోడె


చరణం 1


[ఆమె] ఓ అమ్మో ఓరయ్యో లేలేత గుమ్మడిపండే నా సొగసు వెన్నెల్లే
కరిగించి పులుసల్లే మరిగించాడే ఈ వయస్సు
[అతడు] ఇంతందం ఎదురొచ్చి జివ్వంటూ లాగేస్తే ఆగేదెలా మొహమాటం
వదిలించి మోజంతా కాజేస్తా ఈవేళ
[ఆమె] అబ్బ ఏమి చెప్పనమ్మ సుప్పనాతి సూపులోడె పట్టు చెంగు ఒంటి
నిండా కప్పుకుంటే ఊరుకోడె కందిరిగ నడుముకాడ తేనెకాటు వేసినాడె పట్టుపగలు
పిట్టసోకు కొల్లగొట్టి పోకిరోడె ||ఇందురూడు||


చరణం 2


[అతడు] ఓయమ్మో చిలకమ్మో చెయ్యి అయినా వేయ్యకముందే గిలిగింతా
[ఆమె] నీదుడుకే చూస్తుంటే సిగ్గేదో కమ్మిందమ్మా ఒళ్ళంతా
[అతడు] ఇన్నాళ్ళు ఊరించి ఈనాడే సిగ్గంటే రేగెదెలా ముద్దుల్లో ముంచెత్తి
నీదోద కుచ్చిల్లే లాగాలా
[ఆమె] అయ్యోరామ ఇంతలోన ఎంతపని చేసినాడె అందులోని ఇందులోని
అంతులేని పెద్దరోడే కొంతకాలం ఆగమన్నా ఆగలేని కోడెగాడే కోడికూత వేళ లోపే
కొంప ఇట్టా ముంచినాడే ||ఇందురూడు||