[ఆమె] పచ్చబొట్టు చెరిగిపోదులే!నా రాజా!
పడుచు జంట చెదరిపోదులే
[అతడు] పచ్చబోట్టు చెర్గిపోదులే! నా రాణి
పడచుజంట చెదరిపోదులే!||పచ్చ||
చరణం 1
[ఆమె] పంచినమేలు పసుపుపచ్చ ||2||
నా నిండు మమతలో మెండు సొగసులు లేతపచ్చ
[అతడు] నీ మెడలో పతకం చిలకపచ్చ
మన మేలిమి మురిపం వలపుల పచ్చ
చరణం 2
[అతడు] కలిసిన కలయిక తలవని తలపు ||2||
నీ చెలిమి విలువకే చేతి చలువకే చిగిర్చె నా మనసు
తిరిగెను బ్రతుకే క్రొత్త మలుపు
ఇది తియ్యని వాడని మన తొలివలపు ||పచ్చ||
చరణం 3
[ఆమె] నూరేళ్ళు వెలుగు నుదిటిబోట్టు ||2||
అది నోచిన నోములు పూచిన రోజున
పెళ్ళిబొట్టు కట్టేను నీ చేయి తాళికట్టు
అది పదివేల కాంతుల కలిమిచెట్టు ||పచ్చ||